Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -కోల్కతా
తృణమూల్ కాంగ్రెస్ ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది. ఆ పార్టీకి చెందిన ప్రొఫైల్ నేమ్, ఫొటో మారిపోయాయి. ప్రొఫైల్ నేమ్ యుగ ల్యాబ్స్ గా మారగా, ప్రొఫైల్ ఫొటో వై ఆకారంలో కనిపిస్తోంది.
యుగల్యాబ్స్ అనేది క్రిప్టో సంస్థ పేరుగా తెలుస్తోంది.
అయితే హ్యాకింగ్ తర్వాత కొత్తగా ఒక్క ట్వీట్ కూడా పోస్టు కాలేదు. అయితే నాన్ ఫంగిబుల్ టోకెన్స్ కు సంబంధించిన ట్వీట్లకు మాత్రం ఈ ఖాతా నుంచి సమాధానాలు వెళ్లాయి. ఈ తరుణంలో ఈ హ్యాకింగ్ గురించి తాము ట్విటర్ సంస్థకు ఫిర్యాదు చేసినట్లు తృణమూల్ పార్టీ తెలిపింది.