Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మంగళవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టు అంశాన్ని మనీష్ సిసోడియా తన న్యాయవాది ద్వారా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ముందు ప్రస్థావించనున్నారు.
మనీష్ సిసోడియాను సీబీఐ ఆదివారం అరెస్టు చేసి సోమవారం కోర్టు ముందు హాజరుపర్చింది. సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి పంపారు.మనీష్ సిసోడియాను ఇండియన్ పీనల్ కోడ్ 120 బి, 477 ఎ, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద అరెస్టు చేశారు.