Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన 13 నెలల చిన్నారి అనారోగ్యానికి గురవడంతో మూడు నెలల క్రితం ఆస్పత్రికి తీసుకొచ్చారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు గుండె దెబ్బతిన్నట్లు గుర్తించి గుండె మార్పిడి చేయాలని సూచించారు. ఈ మేరకు జీవన్ దాన్ లో పాప వివరాలను నమోదు చేశారు.
ఈ తరుణంలో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ కు గురైన రెండేండ్ల బాలుడి గుండె దానం చేస్తారనే విషయం పద్మావతి ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనాథరెడ్డి దృష్టికి వచ్చింది. దీంతో ఆయన గుండె చికిత్సల నిపుణుడు డాక్టర్ గణపతి బృందంతో చర్చించి ఆ బాలుడి గుండెను 13 నెలల పాపకు అమర్చాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పాపను ఆదివారం రాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చారు.
టీటీడీ సహకారంతో ప్రత్యేక అంబులెన్స్, మరో ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకొని వైద్య బృందం ఆదివారం రాత్రే చెన్నై చేరుకుంది. గ్రీన్ చానల్ అవసరం లేకుండా కేవలం 2గంటల 15 నిమిషాల్లో గుండెను తిరుపతిలోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. సోమవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో గుండె చేరుకోవడంతో డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డాక్టర్ గణపతి నేతృత్వంలోని బృందం ఉదయం 4:30 గంటలకు శస్త్రచికిత్స ప్రారంభించి 9:40 గంటలకు విజయవంతంగా పూర్తి చేసి చిన్నారికి బతికించారు.