Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢీల్లి
ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్ మరోసారి అగ్రస్థానానికి చేరారు. బ్లూమ్‌బెర్గ్ సూచీ ప్రకారం సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి మస్క్ ఆస్తుల విలువ సుమారు 187.1 బిలియన్ డాలర్లకు చేరింది.
ఈ తరుణంలో ఎలాన్ మస్క్ ఇప్పటి వరకు ప్రథమ స్థానంలో ఉన్న ఎల్వీఎంహెచ్ ఛైర్మన్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను వెనక్కి నెట్టేసినట్లైంది. ప్రస్తుతం ఆర్నాల్ట్ ఆస్తుల విలువ 185.3 బిలియన్ డాలర్లుగా ఉంది. తాజాగా టెస్లా షేర్ల విలువ పెరగడంతో మస్క్ మరోసారి ఈ సూచీలో అత్యున్నత స్థానానికి చేరారు.