Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బంజారాహిల్స్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో అలజడి చేశాడు. బ్రీత్ అనలైజర్ టెస్టులో 94 పాయింట్లు నమోదు కావడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ తరుణంలో ఆ యువకుడు ట్రాఫిక్ పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తాను హైకోర్టు లాయర్‌ను తనకు హైకోర్టు జడ్జి తెలుసంటూ రెచ్చిపోయాడు. నీకు సెక్షన్లు తెలుసా? ఐపీసీ సెక్షన్ 123 కింద నీపై కేసు ఫైల్ చేస్తానంటూ హెచ్చరిస్తూ ట్రాఫిక్ ఎస్ఐని కాలితో తన్నాడు. ఆ యువకుడి పక్కన ఉన్న యువతి సైతం ఎక్కడా తగ్గలేదు. వీడియోలు తీస్తారా? మీకు సిగ్గు లేదా? అంటూ రెచ్చిపోయింది. దీంతో ఆ యువకుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు.