Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముంబై క్రికెట్ ఆసోషియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే మంగళవారం ఉదయం ప్రకటించారు. చారిత్రక వాంఖడే స్టేడియంలో ఒక ఆటగాడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇది తొలిసారి అని కాలే తన ప్రకటనలో తెలిపాడు.
2023 క్రికెట్ వరల్డ్‌కప్ సందర్భంగా ఎంసీఏ లాంజ్ బయట ఉన్న సర్క్యులర్ ప్లాట్‌ఫామ్‌పై సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అమోల్ కాలే తెలిపారు. ఎంసీఏ ఈ ఏడాది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోసం గోల్డ్ జూబ్లీ ఇయర్ ఉత్సవాలను నిర్వహించబోతున్నది. ఆ ఉత్సవాల్లో భాగంగానే సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయాలను అమోల్ కాలే మీడియాకు వెల్లడించినప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా ఆయన పక్కనే ఉన్నాడు.
ఈ తరుణంలో సచిన్ కూడా మీడియాతో మాట్లాడుతూ వాంఖడే స్టేడియం తనకు ఎంతో ప్రత్యేకం అని, తన తొలి రంజీ మ్యాచ్, ఆఖరి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఇదే వేదికపై ఆడానని తెలిపాడు. ఆటలో నాకు 25 ఏళ్ల అనుభవం ఉన్నా నేను 25 ఏళ్ల వాడిలా ఉన్నా. అందుకు నేను ఎంసీఏకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ మాట్టాడారు.