Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
విశాఖపట్నంలో ఓ ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ ఆత్మహత్య కలకలం రేపుతోంది. మువ్వల అలేఖ్య(29) భర్త నరేష్, వారి ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి ఎంవీపీకాలనీలో నివాసం ఉంటున్నారు. నరేష్ ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే, దంపతుల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో రెండేళ్ల కిందట అలేఖ్య తన ఇద్దరు పిల్లలతో కలసి ఆరిలోవ ప్రాంతం మయూరినగర్‌కు వెళ్లిపోయింది. అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అందులోనే ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తోంది. ఈ తరుణంలో ఆదివారం ఆమె అర్ధరాత్రి ఇంట్లో ఉరిపోసుకుని బలవన్మరణం చెందింది.
ఈ ఘటనపై పోలీసులకు కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో భర్త ప్రమేయంపై విచారణ సాగిస్తున్నట్టు తెలుస్తోంది. భార్యాభర్తలు కొంత కాలంగా కలిసి ఉండకపోవడంతో అదే కోణంలో వారు విచారణ సాగిస్తున్నట్టుగా సమాచారం.