Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది. రూ.2.8 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ కారు తన స్నేహితుడి సంస్థకు చెందినదని అవసరమున్నప్పుడు దానిని వాడుకుంటున్నట్లు ప్రవీణ్ అధికారులకు తెలిపారు. అయితే అధికారులు మాత్రం ఇది బినామీ సంస్థ పేరుతో ప్రవీణ్ కొనుగోలు చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్‌కు ఐటీశాఖ నోటీసులు జారీ చేసింది.