Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
టెక్నాలజీల వల్ల పెను మార్పులు వస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల్లో కృత్రిమ మేధాశక్తితో పరిష్కరించగలిగిన 10 సమస్యలను గుర్తించాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యాన్ని సాధించడానికి టెక్నాలజీ దోహదపడుతుందన్నారు. డిజిటల్ విప్లవం ఫలితాలు ప్రజలందరికీ చేరేవిధంగా చేయడం కోసం ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ‘‘సామర్థ్యాన్ని వెలికి తీయడం : టెక్నాలజీని ఉపయోగించుకుంటూ సులువుగా జీవించడం’’ అనే శీర్షికతో జరిగిన వెబినార్లో ప్రధాని ప్రసంగించారు.
ఈ తరుణంలో డిజిటల్ విప్లవం ఫలితాలు ప్రజలందరికీ చేరేవిధంగా చేయడం కోసం ఆధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిన్న తరహా వ్యాపార సంస్థలు నిబంధనలను పాటించడం కోసం చేయవలసిన ఖర్చులను తన ప్రభుత్వం తగ్గించాలనుకుంటోందని తెలిపారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో 5జీ, కృత్రిమ మేధాశక్తి వంటి టెక్నాలజీల వల్ల పెను మార్పులు వస్తాయన్నారు. ప్రజల జీవితాల్లో నాణ్యమైన మేలు రకపు మార్పులను తీసుకొచ్చే విధంగా టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు.