Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశీయ స్టాక్ మార్కెట్లలో డౌన్ ట్రెండ్ కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈ ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల బాట పట్టాయి. జీడీపీ గణాంకాలు వెలువడనున్న తరుణంలో మెటల్ షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 326 పాయింట్లు నష్టపోయి 58,962కి పడిపోయింది. నిఫ్టీ 88 పాయింట్లు కోల్పోయి 17,303 వద్ద స్థిరపడింది.