Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢీల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ అరెస్టు విషయంలో జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ అరెస్టు వ్యవహారాన్ని సవాల్ చేయాలనుకుంటే హైకోర్టుకు వెళ్లవచ్చని సిసోదియాకు సూచించింది.
సీబీఐ ఛార్జీషీటులో సిసోదియా పేరు లేకున్నా ఆయన్ను అరెస్టు చేయడం అక్రమమని సిసోడియా తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా దర్యాప్తునకు సహకరించడం లేదని సీబీఐ చేస్తోన్న ఆరోపణలు కూడా బలహీనమైన సాకుగా పేర్కొన్నారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ అరెస్టును సవాల్ చేయాలనుకుంటే హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.