Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
స్వచ్ఛ భారత్ అవార్డులో మరోసారి తెలంగాణ మెరిసిన. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో రెండు వేర్వేరు విభాగాల్లో తొలి మూడుస్థానాలతో నెంబర్ వన్‌గా నిలిచింది.
అక్టోబర్ – డిసెంబర్-2022 త్రైమాసికానికి స్వచ్ఛ భారత్ ఎంపిక చేసిన రెండు విభాగాల్లోనూ అవార్డులు వరించాయి. స్టార్ త్రీ విభాగంలో తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా, జగిత్యాల జిల్లాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కేరళలోని కొట్టాయం మూడో స్థానంలో నిలిచింది. స్టార్ ఫోర్ విభాగంలో తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, రెండోస్థానంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్, తెలంగాణలోని పెద్దపల్లికి మూడోస్థానం దక్కింది.