Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
ఇటీవల దక్షిణాఫ్రికాలో ముగిసిన మహిళల T20 ప్రపంచ కప్‌లో రెండు గ్రూప్‌లలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు 2024 టీ20 ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించాయి. ఇందులో భారత జట్టు కూడా ఉంది. గ్రూప్ 1 నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా.. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, భారత్, వెస్టిండీస్ క్వాలిఫై అయ్యాయి. బంగ్లాదేశ్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఇందులో ఆరు జట్లు నేరుగా క్వాలిఫై కాగా.. 2024 ఆరంభంలో జరిగే గ్లోబల్ క్వాలిఫైయర్‌లో మిగిలిన రెండు బెర్తులు ఖరారవుతాయి.