Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి ధరావత్ ప్రీతి నాయక్ మృతికి సంతాప సూచికంగా ఎం ఎస్ యు రాష్ట్ర నాయకులు బాలు యాదవ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు బాలు యాదవ్ మాట్లాడుతూ. కాకతీయ మెడికల్ కాలేజీలో విద్యార్థి ప్రీతి నాయక్ మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాల నీడిమాండ్ చేశారు. ఉన్నత విద్యా రంగంలో అట్టడుగు వర్గాల విద్యార్థులు ప్రవేశించడాన్ని కుల ఉన్మాదులు జీర్ణించుకోలేక పోతున్నారు. సామాజిక స్పృహ లేని కొన్ని ఉన్నత విద్యా సంస్థలు కుల వివక్షత కేంద్రాలుగా మారిపోయాయి అన్నారు.
ర్యాగింగ్ కు, జూనియర్ సీనియర్ ల మధ్య వ్యత్యాసాలకు కులం రంగు పులుమి వేధించడం ఉన్నత విద్యా సంస్థలు, పాలన అధికారాలు పాటిస్తున్న అనాగరిక విలువలకు పరాకాష్ట. నేరస్తులను కఠినంగా శిక్షించాలి. ఈ నేర సంస్కృతిని పెంచి పోషించిన కాకతీయ మెడికల్ కళాశాల పాలన అధికారులను, సరైన పర్యవేక్షణ చేయకుండా ఏసీ గదుల్లో కూర్చొని మెడికల్ కళశాలల నిర్వహణ లో నిర్లక్ష్యం చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారాలను తక్షణమే సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఆత్మహత్యలు ఏ సమస్యలకు పరిష్కారం కావు! అణగారిన వర్గాల యువతి యువకుల్లారా! మన జీవితం నిత్య పోరాటం, పోరాడటం నేర్చుకోండి, తెగించడం అలవాటు చేసుకోండి. పోరాట స్పృహకు దూరం అవ్వకండి. ఎన్నో పోరాటాల్లో గెలిచి ఉన్నత విద్యావ్యవస్థలోకి చేరుతున్నాము. కులవివక్షత, అణచివేత, మానసిక బహిష్కరణలు.
ఇలా ఎన్నో సవాళ్లు మన ముందు ఉన్నాయి. కూడా వీటికి పరిష్కారం ఆత్మహత్యలు కావు నిలబడి పోరాడడమే వీటికి పరిష్కారం ఇస్తాయని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ ప్రజలు వ్యాపారస్తులు పాల్గొన్నారు.