Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నటి సమంత సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఓ ఫొటో ఆమె కష్టానికి నిదర్శనంగా నిలుస్తోంది. అందులో ఆమె చేతులు స్వల్ప గాయాలతో బాగా కందిపోయి ఉన్నాయి. అక్కడక్కడా కొద్దిపాటి రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. సిటాడెల్ వెబ్‌సిరీస్ చిత్రీకరణలో ఆమె చేతులకు గాయాలైనట్లు తెలుస్తోంది.
రాజ్-డీకే తెరకెక్కిస్తున్న సిరీస్ ఇది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇందులో సామ్ పాత్ర పూర్తిగా యాక్షన్ కోణంలో సాగనుందని సమాచారం. ఇందుకోసమే ఆమె మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం డూప్ లేకుండా ఆమే స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలోనే తనిలా గాయపడినట్లు తెలుస్తోంది.