Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
వ్యక్తిగత రుణాలు 2023 జనవరిలో 20.4% పెరిగాయని ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. ప్రధానంగా గృహ, వాహన రుణాలు పెరగడమే ఇందుకు కారణమ ఆర్బీఐ మంగళవారం వెల్లడించింది. 2022 జనవరిలో వ్యక్తిగత రుణాల విభాగంలో 12.8 శాతం వృద్ధి నమోదైంది.
2023 జనవరి 27 నాటికి వ్యక్తిగత రుణాలు రూ.39.59 లక్షల కోట్లకు చేరాయి. 2022 ఇదే సమయంలో ఇవి రూ.32.87 లక్షల కోట్లుగా ఉన్నాయి. గృహ రుణాలు రూ.16.36 లక్షల కోట్ల నుంచి రూ.18.88 లక్షల కోట్లకు చేరాయి. వాహన రుణాలు రూ.3.95 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెరిగాయి.