Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబయి
ఇథియోపియా నుంచి ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన వ్యక్తి నుంచి రూ.25కోట్ల విలువైన 2.58 కిలోల కొకైన్ డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సబ్బు కడ్డీల్లో దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు. అడిస్ అబాబా (ఇథియోపియా) నుంచి ముంబయి వెళ్తున్న ఓ వ్యక్తి మారక ద్రవ్యాలను తరలిస్తున్నట్లుగా డీఆర్ఐ అధికారులకు పక్కాగా సమాచారం అందింది.
ఈ క్రమంలో అధికారుల బృందం తనిఖీలు నిర్వహించగా ట్రాలీ బ్యాగ్‌లోని 12 సబ్బు కడ్డీలలో 2.58 కిలోల కొకైన్ ఉంచినట్లు గుర్తించారు. అంతర్జాయ మార్కెట్లో పట్టుబడిన కొకైన్ విలువ రూ.25కోట్లకుపైగా ఉంటుందని అధికారి న్ తెలిపారు. కొకైన్‌ను తరలిస్తున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. నిందితులిద్దరిని డీఆర్ఐ కస్టడీ రిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.