ఉప్పల్‌లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని నడిరోడ్డుపైనే డీసీఎం వాహనం దగ్ధమైంది. ఉదయం నాగోల్ నుంచి సికింద్రాబాద్ వైపు పాత పేపర్ల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం ఉప్పల్ చౌరస్తా వద్దకు రాగానే వాహనం క్యాబిన్లో నుంచి మంటలు వచ్చాయి. ఇది గమనించిన డ్రైవర్ వాహనం ఆపి కిందకి దూకేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న ఆగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే వాహనం పూర్తిగా కాలిపోయింది.