Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నగరంలోని నార్సింగిలో ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ అనే ఇంటర్ స్టూడెంట్ కళాశాలలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒత్తిడి వల్లే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ సిబ్బంది తీరుపై సాత్విక్ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాలేజీ సిబ్బంది తీరువల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ తల్లిదండ్రుల ధర్నాకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో నార్సింగ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఈ తరుణంలో విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవాలని, పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించాలని స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా విచారణ నివేదిక అందించాలని ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.