Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారినా లోక్సభ పార్లమెంట్ గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ నుంచి బీఆర్ఎస్ ను పార్లమెంట్ తొలగించింది. ఇప్పటి వరకు ఆ పార్టీ తరఫున ఎంపీ నామా నాగేశ్వరరావు బీఏసీ సభ్యుడిగా ఉన్నారు. ఇవాళ్టి సమావేశానికి ఆయన్ను ఆహ్వానితుడిగానే లోక్సభ సచివాలయం ఆహ్వానం పంపింది.
అయితే ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులున్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ కు లోక్సభలో 9 మంది సభ్యులున్నా పార్లమెంట్ తొలగించింది. పార్లమెంట్ బీఏసీలో ఇకపై ఆహ్వానిత పార్టీగానే బీఆర్ఎస్ కొనసాగనుంది. ఆహ్వానం పంపితేనే భేటీకి హాజరుకావాల్సి ఉంటుంది.