Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
గుంటూరు జిల్లాలో వ్యాపార, వాణిజ్య దుకాణాలకు వాచ్మెన్లుగా పనిచేస్తున్న ఇద్దరిని దుండగులు దారుణంగా హత్య చేశారు. గుంటూరు పట్టణానికి సమీపంలోని ఇన్నర్ రింగ్ వద్ద యమహా షోరూమ్ వాచ్‌మెన్‌ను బుధవారం తెల్లవారుజామున దుండగులు దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
బైక్‌ల అపహరణను అడ్డుకున్నందుకు వాచ్మెన్పై దాడికి పాల్పడి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా అరండల్‌పేట పదో లైన్లో లిక్కర్ మార్ట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని దుండగులు చంపివేశారు. లిక్కర్‌ను దొంగిలించేందుకు వచ్చి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జాగిలాలను, క్లూస్‌టీం సహాయంతో గాలింపు చర్యలు మొదలు పెట్టారు.