Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ న్యూఢిల్లీ: ప్రముఖ హిందీ నవలా రచయిత, కవి వినోద్ కుమార్ శుక్లా (87) ఈ ఏడాదికి గాను అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు పెన్/నబొకొవ్కు ఎంపికయ్యారు. అంతర్జాతీయ సాహిత్య విభాగంలో ఆయనను ఈ అవార్డు వరించింది. 'నౌకర్ కీ కమీజ్ ' (1979) వంటి నవలలు, 'సబ్ కుచ్ హో నా బచా రహేగా' (1992) కవితా సంకలనాలతో గుర్తింపు పొందారు. దశాబ్దాల తరబడి రాస్తున్నప్పటికీ ఆయన గుర్తింపు రాలేదని, అయితే సామాన్యులు సైతం అర్థం చేసుకునేలా ఆధునికతను మేళవించి చేసిన రచనలతో ప్రత్యేక గుర్తింపు సాధించారని న్యాయమూర్తులు అమిత్ చౌదరి, రొయా హకాకియన్, మెంగిస్టేలు పేర్కొన్నారు. ఆయన రచనల్లో కనిపించే స్వరం తెలివైన వీక్షకుడిలా ఉంటుందని అన్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం మార్చి 2న న్యూయార్క్లో జరగనుంది. శుక్లా గతంలో సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు బెంగళూరు ఫెస్టివల్ బుక్ ఫ్రైజ్ అట్టా గలాట్టాను గెలుచుకున్నారు.