Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కామారెడ్డి: బాన్సువాడ అభివద్ధికి సీఎం కేసీఆర్ రూ.50 కోట్లు ప్రకటించారు. తిమ్మాపూర్ వెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూ. 7కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిధులు దుర్వినియోగం చెందకుండా పనులు చేయించుకోవాలని సూచించారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు సీఎం సతీమణి శోభ.. దాతల సహకారంతో స్వామివారి కోసం తయారు చేయించిన 2 కిలోల బంగారు కిరీటాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా స్వామివారికి సమర్పించారు. అనంతరం సీఎం దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు.