Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీచైతన్య యాజమాన్యం బిఎస్ రావుపై హత్య కేసులు నమోదు చేయాలి
- విద్యార్ధులను కులం పేరుతో దాడి చేసిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ను కఠినంగా శిక్షించాలి
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు ముట్టడి
- అక్రమ అరెస్టులు
నవతెలంగాణ హైదరాబాద్: విద్యార్థులపై ర్యాంకుల పేరుతో తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్న
కార్పోరేట్ శ్రీచైతన్య విద్యాసంస్థల యాజమాన్యంపై హత్య కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. కులం పేరుతో విద్యార్ధి సాత్విక్ ను దూషించిన ఆత్మహత్య చేసుకునేలాగా వ్యవరించిన నార్సింగి శ్రీచైతన్య కళాశాల యాజమాన్యం బిఎస్ రావు, డైరక్టర్ శ్రీధర్, ఎజీఎంలను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్ధులు తెలంగాణ ఇంటర్ బోర్డు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఆ విద్యార్ధి కుటుంబాన్ని ఆదుకోవాలని, శ్రీచైతన్య కళాశాలలపై చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని క్యాంపస్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లడుతూ కార్పోరేట్ విద్యాసంస్థలలో పరీక్షలు సమయం దగ్గరకు రాగానే తమ ర్యాంకులు కోసం విద్యార్ధులను తీవ్రంగా వేధింపులు గురి చేస్తున్నారని, ఇదే శ్రీచైతన్య విద్యాసంస్థ విద్యార్ధిని గత నెలలో ఫిర్జాదిగూడలో ఆత్మహత్య చేకుందని, మళ్ళీ ఇది రెండవ ఘటన అని అన్నారు. ఇంత జరుగుతున్న ప్రభుత్వం కమిటీలు వేశామని కాలయాపన చేస్తుంది తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇంటర్ బోర్డు పరివేక్షణ లోపం కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇరుకు గదులు, సరైన ఆహారం పెట్టకుండా రోజుకు 15 -16 గంటలు చదివిస్తూ తీవ్రమైన ఒత్తిడి గురిచేస్తున్నారని అన్నారు.తక్షణమే శ్రీచైతన్య యాజమాన్యం పై హత్యకేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
కార్పోరేట్ కళాశాలలు ఫీజుల దోపిడీ చేస్తూ విద్యార్థులను మానసికంగా వేధింపులు గురి చేస్తున్నారని, ఇంటర్ బోర్డ్, ప్రభుత్వం చోద్యం చూస్తుంది తప్ప సరైన చర్యలు చేపట్టడం లేదు అన్ని అన్నారు.వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్ కార్యలయం ముందు ధర్నా అనంతరం లోపలికి వెళ్ళెందుకు యత్నించిన విద్యార్ధి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. విద్యార్ధి నాయకులకు, పోలీసులు మద్య తీవ్ర తోపులాట జరిగింది. అనంతరం బలవంతంగా అరెస్టు చేసి బేగం బజార్ పోలీసు స్టేషన్ కు తరిలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కె అశోక్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, ఉపాధ్యక్షులు శ్రీమాన్, నాగేందర్, సునీల్ జిల్లా నాయకులు శివ, వాసు, శ్రీరామ్, సాయి కిరణ్, నిఖిల్, వెంకట్, లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.