Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంపు
నవతెలంగాణ హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో డైట్ ఛార్జీలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై అధికారులతో మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ సమావేశమై చర్చించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సంబంధిత శాఖల అధికారులు సమావేశానికి హాజరయ్యారు. డైట్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించి అందుకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 3 నుంచి ఏడో తరగతి వరకు రూ.1200, 8 నుంచి పదో తరగతి వరకు రూ.1,400, ఇంటర్ విద్యార్థులకు రూ.1,875లకు పెంచాలని ప్రతిపాదించారు. 25శాతానికి పైగా డైట్ ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించిన మంత్రులు.. వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదించారు. మహారాష్ట్ర, ఉత్తర్ప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాలకన్నా తెలంగాణలోనే డైట్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని మంత్రులు తెలిపారు.