Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: సాయిధరమ్ తేజ్ భీమవరం అభిమాన సంఘ అధ్యక్షుడు రావూరి పండు (28) మంగళవారం క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుతో మృతి చెందాడు. పండు మృతితో దిగ్భ్రాంతికి గురైన సాయి.. ‘విరూపాక్ష’ టీజర్‌ను వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీజర్ విడుదలకు సంబంధించిన కొత్త అప్డేట్ను త్వరలోనే ప్రకటిస్తామని టీమ్ వెల్లడించింది. ‘రిపబ్లిక్’ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న చిత్రమిది. కార్తిక్ దండు దర్శకుడు. సంయుక్త కథానాయిక. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందించారు. బుధవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయాల్సివుండగా పండు మృతితో వాయిదా పడింది. నటుడు సాయిధరమ్ తేజ్ అభిమానులకు నిరాశ ఎదురైంది. ఆయన నటించిన సరికొత్త సినిమా ‘విరూపాక్ష’ టీజర్ విడుదల వాయిదా పడింది.