Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ మహా నగరంలో లక్ష మందికి సీపీఆర్ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. జిల్లాల్లో వందల మందికి ఈ శిక్షణ ఇవ్వాలన్నారు. మేడ్చల్ జిల్లాలో సీపీఆర్ శిక్షణను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో నాన్ కమ్యూనికేబుల్ రోగాలు అధికంగా వస్తున్నాయని కేటీఆర్ తెలిపారు.
ఈ క్రమంలో మొన్న ఓ పిల్లోడు డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. జిమ్‌లో వర్కవుట్ చేస్తూ మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని కేటీఆర్ తెలిపారు. ఆ ప్రదేశాల్లో సీపీఆర్ శిక్షణ పొందిన వారు ఉంటే వారి ప్రాణాలను కాపాడేవారని, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, మాల్స్, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సీపీఆర్ శిక్షణ పొందిన వారిని నియమించాలన్నారు. లైఫ్ స్టైల్ ఛేంజెస్ వల్ల ఈ రోగాలు చుట్టుముడుతున్నాయి. సీపీఆర్‌ను నేర్పించగలిగితే చాలా వరకు సడెన్ కార్డియాక్ అరెస్టును తగ్గించొచ్చు. రక్త ప్రసరణ ఆగిపోకుండా ప్రాథమికంగా ఆ వ్యక్తిని కాపాడుకోవచ్చు అని కేటీఆర్ సూచించారు.