Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్నూలు
సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తయిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయాలని, జగనన్న ఇళ్ల నిర్మాణాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలన్న డిమాండ్‌తో సీపీఐ ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
ఈ క్రమంలో అప్రమత్తమైన పోలీసులు రామకృష్ణను అరెస్ట్ చేయడంతోపాటు ఆ పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాలలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రామకృష్ణ బయటకు రాగానే అప్పటికే అక్కడ కాపుకాసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 9 మంది నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించగా, రామకృష్ణను సూరజ్ హోటల్‌కు తరలించి నిర్బంధించారు.