Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నిజామాబాద్
తన ప్రియురాలిని ప్రేమిస్తున్నాడన్న అనుమానంతో దారుణానికి పాల్పడ్డాడో ప్రియుడు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్రానగర్‌లో ఆరు నెలల క్రితం జరిగిన ఈ హత్యోదంతం బుధవారం వెలుగు చూసింది. ఆం ధ్రానగర్ జీపీ పరిధిలోని వెంకటేశ్వరకాలనీకి చెందిన సౌతూరి కార్తీక్ (21) కూలీ. గత సెప్టెంబర్ 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. అదే గ్రామానికి చెందిన బాపట్ల రాజు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.
అదే అమ్మాయి ని కార్తీక్ కూడా ప్రేమిస్తున్నాడనే అనుమానంతో అతనిపై పగ పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని పథ కం వేశాడు. తన తమ్ముడు హరీశ్‌తో కలిసి కార్తీక్‌తో స్నేహం పెంచుకున్నాడు. ఇద్దరు కలిసి నందిపేట్, విజయనగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కార్తీక్‌కు కల్లు తాగించారు. మత్తులోకి వెళ్లాక కార్తీక్‌ను విచక్షణారహితంగా కొట్టి చంపారు. అనంతరం మృతదేహాన్ని రాళ్లల్లో పడేసి, ఇంటికి వచ్చేశారు. ఈ విషయం ఇటీవల కార్తీక్ స్నేహితులకు తెలిసింది. వారు కార్తీక్ తల్లి వెంకటరమణకు తెలుపగా ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహం ఉన్న చోటును గుర్తించారు.