Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సంగారెడ్డి
రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లూరు వద్ద ఓఆర్ఆర్ రోడ్డుపై నుంచి సర్వీస్ రోడ్ పక్కన ఉన్న గుడిసెపై లారీ పడిపోయింది. ఈ తరుణంలో గుడిసెలో నిద్రిస్తున్న కుటుంబంలో ముగ్గురూ మృతి చెందారు. కనీసం తమకేమైందో తెలియక ముందే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
లారీ కింద పడి దంపతులతో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. హర్యానా నుంచి చిత్తూరుకు లారీ బియ్యం లోడ్‌తో వెళుతోంది. లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నందున అదుపు తప్పి కింద ఉన్న గుడిసె మీద పడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న చెట్లకు నీళ్లు పోసే కార్మికులు బాబు రాథోడ్ ( 48 ) కమలీ భాయ్ (43) రాథోడ్ (23) దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌సహాయంతో లారీని అక్కడిన ఉంచి తొలగించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.