Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్ ప్రాంతంలోని ఓ పార్కులో ఆడ కుక్కపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి ఆ ప్రాంతంలో నివాసముంటున్నాడని, అతనికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి, జంతు హింస చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద గత వారం ఫిర్యాదు అందడంతో ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు ఈ దారుణానికి పాల్పడుతుండగా, అతడిని ఎవరో వీడియో తీశారని పోలీసులు తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు చేరింది. ఈ వీడియో ఆధారంగా నిందితుడి కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులు నిందితులను గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.