Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి మండిపడ్డారు. విజయవాడలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ అమరావతి రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సీఎం జగన్ కనికరం కూడా చూపడం లేదు. అమరావతి రైతులకు ఎంత అడ్డుపడితే వారి ఉద్యమం అంతగా బలపడుతుంది. దేశంలో ఇలాంటి ఉద్యమం ఎప్పుడూ జరగలేదు. రాజధాని రైతులు ఏ క్షణంలో పిలిచినా వస్తా. రౌడీయిజంతో రాష్ట్రంలో అందరిపైనా దాడులు పెరిగాయి అన్నారు.
అంతే కాకుండా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఎవరైనా వచ్చి తమను కాపాడకపోతారా? అని ఎదురు చూస్తున్నారు. యూనివర్సిటీ పేరు మార్చినంత మాత్రాన వైఎస్‌కి ఉన్న గౌరవం పెరగదు, తగ్గదు. జగన్ మొదట నువ్వొక యూనివర్సిటీ తెచ్చి దానికి నీ పేరో, నీ తాత పేరో పెట్టుకో. జగన్ ఆరోగ్య స్థితి బాగాలేదు. నేను ఆయనకు ఉచితంగా చికిత్స అందించేందుకు సిద్ధం అని రేణుకా చౌదరి అన్నారు. ఏపీ ప్రజలు నన్ను ఆహ్వానిస్తున్నారు. ఏపీలో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధం. అధిష్ఠానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పార్లమెంట్ స్థానానికైనా పోటీ చేస్తా అని రేణుకా చౌదరి అన్నారు.