Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - త్రిపుర
మూడు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ, దాని మిత్రపక్షాలు మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా సాగుతున్నాయి. అయితే మేఘాలయలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగుతున్నది. అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య నువ్వాననా అన్నట్లుగా ఆధిక్యం మారుతున్నది. రాష్ట్రంలోని మొత్తం 60 స్థానాల్లో 59 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం అందులో ఎపీపీ 14 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక రాష్ట్రంలో ఎలాగైనా పాగావేయాలని పట్టుదలతో ఉన్న టీఎంసీ 14 చోట్ల లీడ్లో ఉన్నది. ఇక బీజేపీ 5, కాంగ్రెస్ 8, ఇతరులు 18 చోట్ల ఆధిక్యంలో నిలిచారు. త్రిపురలో బీజేపీ కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా కాంగ్రెస్ వామపక్షాల కూటమి 19 చోట్ల ముందంజలో ఉంది. టీఎంపీ (తిప్రా మోథ్రా పార్టీ) 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.