Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పశ్చిమ బెంగాల్
గత కొన్ని రోజులుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అడోనోవైరస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. వైరస్ కారణంగా రెండేళ్ళ లోపు చిన్నారులు ఆస్పత్రిపాలవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో గత 24 గంటల్లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఏడుగురు చిన్నారులు మరణించినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది.
రాష్ట్రంలో ఇప్పటివరకు 12 అడెనోవైరస్ మరణాలు నమోదయ్యాయని, వారిలో ఎనిమిది మందికి పలు సమస్యలు ఉన్నాయని ఓ ప్రకటనలో తెలిపింది. కోల్కతాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐదుగురు, బంకురా సమ్మిలాని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా 12 మంది మరణించారు. వారిలో ఎనిమిది మందికి పలు సమస్యలు ఉన్నట్లు గుర్తించాం. వైరస్ లక్షణాలతో ఉన్న వారి నమూనాలను పరీక్షల కోసం పంపాం. వారి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది అని ప్రభుత్వం తెలిపింది.