Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ప్రసారాల్లో అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లు నెట్‌ఫ్లిక్స్ ప్రసారాలను వీక్షించలేకపోతున్నారని ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్.కామ్ తెలిపింది. దాదాపు 55 శాతం మంది యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌తో సమస్య ఎదుర్కొంటున్నట్లు అంచనా వేసింది. అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా 200 మిలియన్లకు పైగా పెయిడ్ సబ్స్క్రైబర్లు ఉన్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రంగంలో అగ్రగామిగా కొనసాగుతుంది.