Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్లో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే వసంత్ రావు బోండే, కిన్వత్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాంరెడ్డి రాంకిస్టు సహా 21 మంది నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరిందరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కేసీఆర్. తెలంగాణ అభివృద్ధిని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తామని మహారాష్ట్ర నేతలు ప్రకటించారు. అధినేత కేసీఆర్ ఆదేశానుసారం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ మాజీ జనరల్ సెక్రటరీ విఠల్ నాయక్, కాంగ్రెస్ జడ్పీ సభ్యులు సరిత వర్కడ్, ఎంఎస్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధన్లాల్ పవన్, నాందేడ్ జడ్పీ సభ్యుడు నందతాయ్ పవర్, నాందేడ్ జిల్లా మాజీ అధ్యక్షులు సునీత భజలికన్, ఎన్సీపీ మహిళా అఘాడీ జిల్లా మాజీ జనరల్ సెక్రటరీ యశోదతాయ్ కోలి, పర్హాన్ జనశక్తి పార్టీ తాలుకా మాజీ అధ్యక్షులు దిలీప్ నాయక్, లహాన్ జడ్పీ సర్కిల్ అర్ధాపూర్ అరవింద్ దేశ్ముఖ్, హిందూ యువ పరిషత్ అధ్యక్షులు రంజిత్ దేశ్ముఖ్, బీజేపీ యువమోర్చా తాలుకా జనరల్ సెక్రటరీ వైభవ్ కాలే, హాలేగావ్ మాజీ సర్పంచ్ గజానన్ ధుమలే, లహన్ పంచాయతీ సమితి, శిర్సేనా అధ్యక్షులు బాబూరావ్ కోర్బన్వాడ్, నాందేడ్ మాజీ కార్పొరేటర్ మహ్మద్ ఫరాక్, ఏబీవీపీ సహాయ్ సంయోజక్ కృష్ణ ఇంగిల్, ఏబీవీపీ ప్రెసిడెంట్ జాషశ్రీ ఇల్లెదుల, వంచిత్ బహుజన్ పార్టీ కార్యదర్శి రాజేశ్ సోలంకి, నాందేడ్ జిల్లా బార్ అసోసియేషన్ సభ్యుడు గణేశ్ జాదవ్, పిర్ భూషణ్ వార్డు ప్రెసిడెంట్ సలీమ్ సయ్యద్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ సోయబ్ ఉన్నారు.