Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రెండవ రోజు నిరసన కొనసాగుతుంది. ఇందులో భాగంగా గురువారం రాత్రి అంగన్వాడీలు జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ముందు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. సుమారు రెండు వందల మంది అంగన్వాడిలు పాల్గొని టెంట్ వేసుకొని అక్కడే నిద్రించారు. టీచర్స్ తో సమానంగా అంగన్వాడి ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత, తదితరుల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.