Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు శుక్రవారం (మార్చి 3,2023) స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గురువారంతో పోల్చుకుంటే శుక్రవారం 150 రూపాయలు పెరిగింది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర గురువారం నాడు 51,600 రూపాయలు ఉండగా, శుక్రవారం ఈ ధర రూ.51,750కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర గురువారం రోజు 56,290 రూపాయలు ఉండగా, శుక్రవారం నాడు 56,450 రూపాయలకు పెరిగింది. 24 గ్రాముల బంగారం 10 గ్రాములపై 160 రూపాయలు పెరగడం గమనార్హం.