Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒరియా స్టార్ సినీ నటుడు పింటు నంద హైదరాబాద్ లో కన్నుమూశాడు. ఆయన వయసు 45 ఏళ్లు. గత కొంత కాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన పరిస్థితి నానాటికీ విషమిస్తుండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ఇక్కడ ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆయనకు లివర్ డోనార్ దొరికినప్పటికీ... అతని బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోవడంతో... లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్ సాధ్యం కాలేదు. దీంతో, చివరకు ఆయన ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మరణంతో ఒరియా సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది. ఒరియా సూపర్ స్టార్ సిద్ధాంత్ మహోపాత్ర స్పందిస్తూ... పింటూ తనకు తమ్ముడిలాంటివాడని, ఆయన ఆకస్మిక మరణం ఎంతో బాధిస్తోందని చెప్పారు.