Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మార్చి 12న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనున్న 95వ ఆస్కార్ వేడుకలకు ప్రముఖ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె హాజరుకానున్నారు. ఈ విషయాన్ని స్వయానా ఆమే తన ఇన్స్ స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టులో ప్రెజెంటర్స్ లిస్ట్ తో కూడిన నేమ్స్ ఉన్నాయి. ఈ జాబితాలో రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, ట్రాయ్ కొట్సూర్, డ్వేన్ జాన్సన్, జెన్నిఫర్ కన్నెల్లీ, శామ్యూల్ ఎల్. జాక్సన్, మెలిస్సా మెక్‌కార్తీ, జో సల్దానా డోనీ యెన్, జోనాథన్ మేజర్స్, క్వెస్ట్‌లోవ్ ఉన్నారు. దాంతో పాటు ఆస్కార్స్, ఆస్కార్స్ 95 హ్యాష్ ట్యాగ్ లను కూడా దీపికా క్యాప్షన్ లో చేర్చింది. ఈ పోస్ట్ పై దీపికా పదుకొణె అభిమానులు వేల కామెంట్లు చేశారు. 'ఆస్కార్‌లో పఠాన్ అమ్మాయి' అని నెటిజన్ కామెంట్ చేయగా.. 'ఈ టైమ్ మాది దీపికా మామ్' అని మరొకరు రాసుకొచ్చారు.