Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు నిన్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ అయిన ఆయన జనవరి 28న తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గుండెపోటుకు గురైనప్పటి నుంచి కోమాలోనే ఉన్న ఆయన నిన్న ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం ఈ నెల 25న ముగియనుంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరోవైపు బచ్చుల అర్జునుడు మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. బచ్చుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఏపీ నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కూడా బచ్చుల మృతి పట్ల సంతాపాన్ని ప్రకటించారు. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.