Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: కన్న తండ్రినే మోసం చేయాలని చూశాడు ఓ కొడుకు. రూ. లక్ష ఎగ్గొట్టేందుకు తండ్రిని మోసం చేయడానికి ప్రయత్నించాడు. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే..బాలాపూర్లో యువకుడు రమేష్ కిడ్నాప్ డ్రామా ఆడాడు. తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ కొడుకు రమేష్ ఫొటోలు, వీడియోలు తండ్రికి పంపాడు. కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెడుతున్నారంటూ వీడియోలు రికార్డ్ చేసి పంపించాడు. అప్రమత్తమైన తండ్రి..తన కొడుకును కిడ్నాప్ చేశారంటూ తండ్రి బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రమేష్ ను గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు.