Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగబోతోంది. ఈ నెల 14న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఏపీ సెక్రటేరియట్ లోని ఒకటో బ్లాక్ లో 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.