Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అద్భుతం జరిగి స్వల్ప లక్ష్యాన్ని భారత్ కాపాడుకుంటుందేమోననే అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారత్‌ఫై ఆసీస్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. చివరి టెస్టు మ్యాచ్ మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానుంది.
టీమ్ఇండియా నిర్దేశించిన 76 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. రెండో బంతికే కీలకమైన ఉస్మాన్ ఖవాజా (0) రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కీపర్ శ్రీకర్ భరత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే, ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన లబుషేన్ (28లి)తో కలిసి మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49లి) మ్యాచ్‌ను పూర్తి చేసేశాడు. ఆరంభంలో వీరిద్దరూ ఆచితూచి ఆడినప్పటికీ.. క్రమంగా దూకుడు పెంచి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. భారత స్పిన్నర్లు కట్టుదిట్టంగా బంతులు వేసినప్పటికీ అడపాదడపా భారీ షాట్లు కొట్టి ఛేదనను తేలిక చేశారు. రెండో వికెట్‌కు అజేయంగా 78 పరుగులు జోడించి విజయం సాధించారు.