Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. కౌకూర్ భరత్ నగర్ లో, అలీ ఖాన్ (37) అనే యువకుడిని దుండగులు అతి కిరాతకంగా కొట్టి, కాల్చి చంపేశారు. గతంలో ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న మృతుడు, అంతేకాకుండా సంవత్సరం క్రితం పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నాడు అలీ ఖాన్. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.