Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నది. 3 నుంచి ఏప్రిల్ 10 వరకు www.eamcet. tsche.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. సందేహాలకు tseamce thelpdesk 2023@ jntuh.ac.in ఈ మెయిల్ లేదా 74169 23578,74169 08215 నంబర్లను సంప్రదించవచ్చని సూచించారు.
ఎంసెట్ షెడ్యూల్
ఎంసెట్ నోటిఫికేషన్- ఫిబ్రవరి 28న
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం- మార్చి 3 (శుక్రవారం)
దరఖాస్తులకు చివరితేదీ- ఏప్రిల్ 10 (అపరాద రుసుము లేకుండా)
రూ.250 ఫైన్‌తో- ఏప్రిల్ 15
రూ.1000 అపరాద రుసుముతో- ఏప్రిల్ 20
రూ.2500 ఫైన్‌తో- ఏప్రిల్ 25
రూ.5000 అపరాద రుసుముతో- మే 2
దరఖాస్తు ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600
హాల్‌టికెట్ల డౌన్లోడ్- ఏప్రిల్ 30 నుంచి
పరీక్ష తేదీలు- మే 7 నుంచి 11 వరకు
పీజీ ఈసెట్ దరఖాస్తులు
పీజీ ఈసెట్ దరఖాస్తులను శుక్రవారం నుంచి ఏప్రిల్ 30 వరకు స్వీకరిస్తారు. మే 29 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మే 21 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వివరాలకు www.pgecet.tsche.ac.in లో సంప్రదించాలి.
పీజీ ఈసెట్ షెడ్యూల్
పీజీసెట్ నోటిఫికేషన్- ఫిబ్రవరి 28న
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం- మార్చి 3 (శుక్రవారం)
దరఖాస్తులకు చివరితేదీ- ఏప్రిల్ 30 (అపరాద రుసుము లేకుండా)
రూ.250 ఫైన్‌తో- మే 5
రూ.1000 అపరాద రుసుముతో- మే 10
రూ.2500 ఫైన్‌తో- మే 15
రూ.5000 అపరాద రుసుముతో- మే 24
దరఖాస్తు ఫీజు- రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600
హాల్‌టికెట్ల డౌన్లోడ్- మే 21 నుంచి
పరీక్ష తేదీలు- మే 29 నుంచి జూన్ 1 వరకు