Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
సూపర్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లా మన్నత్లోకి గురువారం ఇద్దరు యువకులు చొరబడ్డారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బయటి గోడను దూకి మన్నత్ ప్రాంగణంలోకి ప్రవేశించించారు. ఆ తరుణంలో భద్రతా సిబ్బంది వారిని పట్టుకున్నారు.
పోలీసుల విచారణలో 20, 22 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు, తాము గుజరాత్ నుంచి వచ్చామని, తమ అభిమాన హీరోను కలవాలనే వచ్చామని తెలిపారు. అంతకు మించి దురుద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులపై ఏమైనా నేరచరిత్ర ఉందేమో అన్న కోణంలోనూ విచారిస్తున్నారు. యువకులిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.