Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుంటూరు
గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. రాత పరీక్ష ద్వారా ఆరోతరగతిలో అడ్మిషన్స్ తీసుకుంటారు. దీంతో పాటుగా ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో మిగిలిన సీట్లను కూడా భర్తీ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 28 గురుకులాల్లో అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. బోధన ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. సీబీఎస్ఈ సిలబ్‌సను అనుసరిస్తారు. తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు కూడా అప్లయ్ చేసుకోవచ్చు. విద్యార్థులు దరఖాస్తు ఫారంలో తాము ఎంచుకొన్న గురుకులాల ప్రాధాన్య క్రమాన్ని తప్పనిసరిగా సూచించాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ 30
మెరిట్ జాబితా విడుదల: మే 10న
ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల: మే 17న
వెబ్సైట్: https://aptwgurukulam.ap.gov.in