Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ లో ఆసీస్‌కు తొలి విజయం దక్కింది. మూడు రోజు తొలి సెషన్‌లోపే ముగిసిన మ్యాచ్‌లో భారత్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. వరుసగా రెండు టెస్టులను ఓడిపోయినప్పటికీ మూడో టెస్టులో విజయం సాధించడంతో డబ్ల్యూటీసీలో ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరడం విశేషం.
ఈ క్రమంలో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆసీస్ 68.52 పర్సేంటేజీతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత టీమ్ఇండియా 60.29 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. వీటితో పాటుగా శ్రీలంక (53.33), దక్షిణాఫ్రికా (52.38) భారత్‌కు పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి.