Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
విశాఖ వేదికగా జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్)లో సీఎం జగన్ పాల్గోన్నారు. ఈ తరుణంలో అయన మాట్లాడుతూ దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో కీలకంగా మారిందని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని, దాదాపు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్రం వేదిక కానుందని అన్నారు.
రాష్ట్రంలో 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశాలున్నాయి. సదస్సు మొదటి రోజు వివిధ సంస్థలతో 92 ఒప్పందాలు (ఎంవోయూ) జరిగాయి. 340 సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. రాష్ట్రంలో 6 పోర్టులు ఉన్నాయి. మరో 4 పోర్టులు రాబోతున్నాయి. పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములున్నాయి. నైపుణ్యం కలిగిన యువతకు ఏపీలో కొదువ లేదు అని సీఎం తెలిపారు. ఈ క్రమంలోనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని జగన్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏపీలో క్రియాశీలక ప్రభుత్వం ఉంది. విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోంది. నేను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నాను. త్వరలోనే ఇది సాకారం అవుతుంది అని సీఎం జగన్ వెల్లడించారు.